వై.పాలెం మండలంలోని నల్లమల అటవీప్రాంతానికి చెందిన పాలుట్ల గిరిజన గూడెంలో గురువారం రాత్రి పెద్దపులి కలకలం రేపింది. సచివాలయ భవనం వెనుక పులి దాడిలో ఆవు, దూడ మృతిచెందాయి. మిగిలిన ఆవులు అరవడంతో గ్రామస్థులు కేకలు వేయగా పులి అటవీకి పారిపోయింది. రైతు సేవనాయక్ తెలిపిన ప్రకారం, దాదాపు రూ.లక్ష నష్టం వాటిల్లింది. విచారణకు ఫారెస్టు రేంజర్ సుబ్బారావు ఆదేశించారు.