యర్రగొండపాలెం: పొట్టకూటి కోసం వెళ్లిన కూలీలకు తీవ్ర గాయాలు

80చూసినవారు
యర్రగొండపాలెంలోని గడ్డమీదిపల్లి, వీరభద్రపురంకి చెందిన 15 మంది కూలీలు బొప్పాయి పంటను కోసి మార్కాపురం వెళుతున్న క్రమంలో ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బొలెరో, బొప్పాయి లోడ్ తో వెళ్తున్న మినీ లారీ ఢీకొన్నాయి. 15 మంది కూలీలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ఐదుగురు పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్