ఏ. బి వెంకటేశ్వరరావుపై యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా సోమవారం ఫైర్ అయ్యారు. జగన్ ను హత్య చేయాలన్న పన్నాగంతోనే శ్రీనివాస్ దాడికి పాల్పడినట్టుగా ఛార్జ్ షీట్ లో ఎన్ఐఏ చెప్పిన విషయం వెంకటేశ్వరరావు మరిచిపోయారామరచిపోయారా అని ప్రశ్నించారు. జగన్ పై దాడి చేసిన సమయంలో డీజీపీగా ఉన్న ఠాకూర్కి, ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న మీకు నామినేటెడ్ పోస్టులు ఎలా వచ్చాయ్? అంటూ ప్రశ్నించారు.