డిసెంబర్ 31 రాత్రి ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేపడితే చర్యలు తప్పవని యర్రగొండపాలెం ఎస్ఐ పి. చౌడయ్య మంగళవారం హెచ్చరించారు. బైక్ సైలెన్సర్ తీసేయడం, ట్రిపుల్ రైడింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. డీజేలు పెట్టరాదని కోరారు. అనుమతులు లేకుండా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా చర్యలు ఉంటాయని తెలిపారు. అందరూ కలిసికట్టుగా ఆనందాల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.