ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని ఓ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సును మార్కాపురం ఆర్టీవో మాధవరావు శనివారం సీజ్ చేశారు. పన్నులు, వాహన బీమా చెల్లించలేదని వాహన తనిఖీలలో భాగంగా ఆర్టీవో గుర్తించారు. బస్సును సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అప్పటికే స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులను వారి గృహాలకు తరలించిన తర్వాత అధికారులు బస్సును పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.