ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంగపాలెం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో కొండచిలువ బెంబేలెత్తించింది. జనావాసాల్లోకి కొండచిలువ రావడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. భారీ కొండచిలువను చాకచక్యంగా బంధించి స్థానిక నల్లమల అటవీ ప్రాంతంలో విడిచి పెట్టామని అటవీ శాఖ అధికారులు గురువారం ఉదయం మీడియాకు వెల్లడించారు. పాములు కనిపిస్తే చంపకుండా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.