యర్రగొండపాలెం: పెద్దపులి దాడిలో రెండు ఎద్దులు మృతి

73చూసినవారు
యర్రగొండపాలెం: పెద్దపులి దాడిలో రెండు ఎద్దులు మృతి
యర్రగొండపాలెం మండలం పాలుట్లలో పెద్దపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. గురువారం రాత్రి సమయంలో పశువుల మంద పై దాడి చేసి రెండు ఎద్దులను పెద్దపులి హతమార్చింది. పశువుల మందను గమనించిన రైతు పెద్దపులి దాడిలో ఎద్దులు మృతి చెందిన విషయాన్ని గుర్తించాడు. దాదాపు రూ. 2 లక్షలు విలువచేసే ఎద్దులు మృతి చెందినట్లుగా రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.

సంబంధిత పోస్ట్