నియోజవర్గ కేంద్రం వై.పాలెంలో ఉపాధి హామీ కార్యాలయం ఇరుకు గదుల్లోనే నిర్వహించాల్సి వస్తోంది. స్త్రీశక్తి భవనం పైఅంతస్థులో ఈ ఉపాధిహామీ కార్యాలయాన్ని నిర్వహించాలని ప్రతిపాదించి నిధులు మంజూరు చేస్తామని మాజీ మంత్రి సురేష్ అప్పట్లో హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. నేడు కూటమి ప్రభుత్వమైన దీనిపై దృష్టిసారించి నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది.