యర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను దళిత సంఘాలు చేపట్టాయి. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ ఛార్జ్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అని ఎరిక్షన్ బాబు కొనియాడారు.