యర్రగొండపాలెంలో శుక్రవారం పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని స్థానిక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ఈ ర్యాలీ కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు భారీగా హాజరయ్యారు. అనంతరం స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే చంద్రశేఖర్ వినతి పత్రానికి సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.