ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ బుధవారం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే లోకేశ్ ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. లోకేశ్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. కాగా, ప్రశాంత్ కిశోర్ బీహార్‌లో రాజకీయ పార్టీ నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పలు కీలక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయంగా చర్చ జరుగుతోంది.