AP: చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని నిన్న వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆదివారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి స్పందించారు. ‘మేము ఏం తప్పు చేయలేదు. దేనికైనా రెడీ. ప్రజలను మోసం చేసింది మీరు. చిలకలూరిపేటను లూటీ చేశారు. భూకబ్జాలకు పాల్పడ్డారు. రజిని అరాచకాలను మొత్తం బయటకు తీస్తాం. ఏడు నెలల తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రండి.’ అని రజినికి ప్రత్తిపాటి సవాల్ విసిరారు.