ఆరుతడి పంటగా సాగుచేసిన వేరుశనగ పంట చాలాచోట్ల కొన్ని రోజుల్లో కోతకు రానుంది. ప్రస్తుతం పంట కాయగట్టిపడే దశలో ఉంది. అయితే వేరుశనగ కోత, అనంతరం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వేరుశనగ మొక్కలను పీకేటప్పుడు నేల గుల్లగా ఉండేలా చూసుకోవాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. మొక్క నుంచి కాయలను వేరేచేశాక కాయలను నిల్వచేసినప్పుడు, బూజుతెగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.