సేంద్రియ మల్చింగ్ విధానంలో పదార్థాలు కుళ్లడానికి వాతావరణ పరిస్థితులను బట్టి 2-3 నెలలు పట్టవచ్చు. అందుకే 2-3 నెలలకు ఒకసారి కొత్త మల్చులు తయారు చేసుకోవాలి. మొక్క మొదళ్లకు మరీ దగ్గరగా మల్చులు వేస్తే కాండం అంటుకొని మొక్క కుళ్లిపోయే ప్రమాదం ఉంది. సేంద్రియ మల్చును ఎక్కువ దళసరిగా వేస్తే మొక్కకు నీరు, గాలి లభ్యత తగ్గిపోతుంది. ముందే వేసిన మల్చును నేలలో కలియతిప్పాలి.