రక్తపోటు పరీక్ష చేసే గంట ముందు ధూమపానం, వ్యాయామం చేసి ఉండకూడదు. కాఫీ కూడా తాగకూడదు. కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత పరీక్ష చేయించుకోవాలి. పరీక్ష చేసే సమయంలో బీపీ చూసే మెషీన్ ఆ వ్యక్తి గుండె ఎత్తులో ఉండాలి. ఆ వ్యక్తి పాదాలు పూర్తిగా నేల మీద ఉండాలి.వెనక ఆసరా ఉండాలి. చెయ్యి ఎక్కడైనా ఆసరాతో పెట్టి ఉండాలి. బీపీ చూసే సమయంలో కదలకుండా, మాట్లాడకుండా ఉండాలి.