AP: విశాఖలో గర్భిణీ అనూషను హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఏసీపీ కీలక విషయాలు వెల్లడించారు. తనకు పెళ్లైనట్లు పేరెంట్స్ కు తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని భార్య అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. గతంలో పలుమార్లు చంపడానికి యత్నించాడు. అలాగే ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్ అందరికీ వీడియో కాల్ చేసి చెప్పి భార్యను చంపినట్లు పోలీసులు తెలిపారు.