ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే జరగాలని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. మాతృభాషకు ఇతర భాషలకు తల్లిపాలకు.. పోత పాలకు ఉన్నంత తేడా ఉందన్నారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించిన 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ముగింపు కార్యక్రమానికి దుర్గేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఐదేళ్లలో తెలుగు భాషకు తూట్లు పొడిచేలా గత ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయన్నారు. ఆంగ్ల భాషలోనే భోదన జరగాలని గత ప్రభుత్వం నిర్ణయించి తెలుగుకు ద్రోహం చేసిందని మండిపడ్డారు.