పడవపై విహరించిన ప్రధాని మోదీ (VIDEO)

85చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ఈ సందర్బంగా మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో స్నానమాచరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాగరాజ్‌లోని అరయిల్ ఘాట్‌ సమీపంలో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలమైన సంగం వద్ద పడవ ప్రయాణం చేశారు. పడవలో నుంచి ఒడ్డున్న ఉన్న భక్తులకు ఆయన అభివాదం చేశారు. ప్రధాని వెంట ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ కూడా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్