AP: ఈ నెల 20న ప్రధాని మోదీ విశాఖపట్నం రానున్నారు. శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో నేవీ కమాండ్ గెస్ట్ హౌస్‌కు వెళ్తారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.