ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మహా కుంభమేళాకు రానున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్‌కు చేరుకుంటారు. అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. సీఎం రాక నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కాగా.. గత నెల 13న మొదలైన కుంభమేళా ఈ నెల 26తో ముగియనుంది.