భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా తన కెరీర్‌లో తొలిసారిగా 90 మీటర్ల మార్క్‌ను అధిగమించిన సందర్భంలో ప్రధాని మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. శుక్రవారం దోహా డైమండ్ లీగ్ పోటీల్లో నీరజ్ 90.23 మీటర్ల దూరం జావెలిన్ విసిరి వ్యక్తిగతంగా ఉత్తమ ప్రదర్శన చేశాడు. ఈ విజయంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఇది నీరజ్ శ్రమ, పట్టుదల ఫలితమని, తనను చూసి దేశం గర్వపడుతోందని పేర్కొన్నారు.