మే 2న అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతి పునర్నిర్మాణ పనులలో భాగంగా మోదీ ఈ పర్యటన చేపట్టనున్నారని తెలిపారు. వచ్చే మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారుల నిర్మాణాన్ని పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇన్‌ఛార్జి మంత్రుల పర్యటనల్లో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నేతలు కూడా భాగస్వాములవ్వాలని ఆయన సూచించారు.