AP: ఏలూరు జిల్లా, పెదవేగి మండలం కూచింపూడిలో విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల అనంతరం తరగతుల జిల్లా పరిహత్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న మేడూరి వెంకట సురేష్ (47) గుండెపోటుతో మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం ఉపాధ్యాయులతో సమీక్ష జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.