పశువుల షెడ్లకు ఆస్తి, ఇంటి పన్ను రద్దు: సీఎం చంద్రబాబు

64చూసినవారు
పశువుల షెడ్లకు ఆస్తి, ఇంటి పన్ను రద్దు: సీఎం చంద్రబాబు
AP: విజయవాడలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (GFST) ఆధ్వర్యంలో పశుసంవర్ధక టెక్ ఏఐ 2.0 సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడి రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో రూపొందించిన డ్యాష్‌బోర్డును ప్రారంభించారు. ఈ మేరకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నిరకాల పశువైద్య సేవలను ఎస్మా పరిధిలోకి తెస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల షెడ్లకు తక్షణమే ఆస్తి, ఇంటి పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్