ఆస్తి తగాదాలు.. తమ్ముడిని నరికి చంపిన అన్న

51చూసినవారు
ఆస్తి తగాదాలు.. తమ్ముడిని నరికి చంపిన అన్న
AP: అనంతపురం జిల్లా పుట్లూరులో శనివారం దారుణహత్య జరిగింది. ఆస్తి తగాదాలతో సొంత తమ్ముడిని అన్న వేట కొడవలితో నరికి చంపాడు. ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములు చిన్న కంబగిరి, పెద్ద కంబగిరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తమ్ముడు చిన్న కంబగిరి ఇంట్లోకి వెళ్లి అన్న పెద్ద కంబగిరి వేట కొడవలితో హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్