AP: తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో ఉన్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో పీఎస్‌ఎల్‌వీ –61ను లాంచ్ చేయడానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ప్రయోగానికి సంబంధించి రాకెట్ సన్నద్ధత సమీక్ష (ఎంఆర్‌ఆర్) జరిగింది. ఇక ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. 22 గంటల కౌంట్‌డౌన్ నిర్వహించాలని నిర్ణయించారు. శనివారం ఉదయం 7.59 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆదివారం 5.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ –61 నింగిలోకి దూసుకెళ్లనుంది.