PSR ఆంజనేయులుకు తీవ్ర అస్వస్థత

83చూసినవారు
PSR ఆంజనేయులుకు తీవ్ర అస్వస్థత
AP: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్‌‌ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. హైబీపీ, హృద్రోగ సమస్యతో ఆయన బాధపడుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆంజనేయులు చికిత్స పొందుతున్నారు. కాగా, ఏపీపీఎస్సీ పరీక్ష మూల్యాంకనం అవకతవకల కేసులో ఆంజనేయులు అరెస్ట్ అయి విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్