PSR ఆంజనేయులుకు అస్వస్థత

66చూసినవారు
PSR ఆంజనేయులుకు అస్వస్థత
AP: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు సోమవారం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో బాధపడుతున్న ఆయనను పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, రెండు రోజుల క్రితం కూడా పీఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. బీపీలో హెచ్చు తగ్గులు ఉండటంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు చికిత్స చేయించారు.

సంబంధిత పోస్ట్