AP: మంగళగిరి ఎయిమ్స్ ర్యాగింగ్ భూతం రెచ్చిపోయింది. ఓ జూనియర్‌ను సీనియర్ వైద్య విద్యార్థులు వేధించారు. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. నలుగురిపై 18 నెలలు, మరో 9 మందిపై 12 నెలలు వేటు వేసినట్లు వివరించారు. కాగా, బాధిత విద్యార్థుల్లో డీన్ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధించినట్లు విచారణలో తేలడంతో, ర్యాగింగ్ చట్టాల ప్రకారం వీరిపై కఠిన చర్యలు తీసుకున్నారు.