వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళలను అవమానించారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. కులవివక్షకు సంబంధించిన పదాన్ని ఆయన వాడారని రఘురామ పేర్కొన్నారు. సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఇలాంటి అవమానకర భాషను ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.