రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కొందరు బహిరంగంగా అర్బన్ నక్సల్స్ భాషను మాట్లాడతారు. భారత రాజ్యంపై యుద్ధం ప్రకటించే వారు ఈ దేశ రాజ్యాంగాన్ని లేదా ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోలేరు’ అంటూ ఆరోపించారు. ‘దేశంలో అన్ని వ్యవస్థల్లోకి ఆర్ఎస్ఎస్, బీజేపీ చేరాయని, మేము కేవలం ఈ రెండింటితోనే కాకుండా భారత రాజ్యంపై పోరాడుతున్నాము’ అని రాహుల్ అనడంపై ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.