ఏపీకి వర్ష సూచన.. స్కూళ్లకు సెలవులు పెంపు?

84చూసినవారు
ఏపీకి వర్ష సూచన.. స్కూళ్లకు సెలవులు పెంపు?
AP: రాష్ట్రంలో ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ రిలీజ్ చేసిన ఓ ప్రకటన విద్యార్థులకు వరంగా మరనున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే ఏపీలో నాలుగు రోజులపాటు (రేపటి నుంచి 14 వరకు) భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించే అవకాశం లేకపోలేదు అని పలువురు అధికారులు అంటున్నారు. కాగా, సోమవారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం పడింది.

సంబంధిత పోస్ట్