IPL-2025 శనివారం పునఃప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రేపు జరగాల్సిన బెంగళూరు, కోల్‌కతా మ్యాచ్ కి వరుణుడి ముప్పు పొంచి ఉంది. కొన్నిరోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు పడుతున్నాయి. చిన్నస్వామి స్టేడియం కూడా చెరువును తలపించేలా మునిగిపోయింది. శనివారం కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. మరీ, మ్యాచ్ జరుగుతుందా లేదనేది రేపు తేలనుంది.