AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 12-14వ తేదీల (ఆది, సోమ, మంగళవారం) వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలతో పాటు తిరుపతి, చిత్తూరు, YSR, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఆదివారం భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.