ఏపీలో తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని.. అవసరమైన ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. తడిచిన ధాన్యం ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. వర్షాల ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.