ఏపీలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. గత వారం రోజులుగా వానలు లేకపోవడంతో ప్రశాంతంగా ఉన్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త చెప్పింది. నేటి నుంచి గురువారం వరకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.