ఏపీలో మరో ఆరు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఫస్ట్ రెండు రోజులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. నేడు, రేపు దక్షిణ కోస్తా జిల్లాలో కొన్నిచోట్ల తేలికపాటి, మోస్తారు వర్షాలు పడతాయని, తరువాతి నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.