గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీలోకి వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అర్ధరాత్రి నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన ఈ భారీ బడ్జెట్ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.