తిరుమల శ్రీవారి ఆలయం గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి ఏవీ రమణ దీక్షితులను జగన్ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే.
టీటీడీ గత ఈవో ధర్మారెడ్డి ఉత్తర్వులను రమణ దీక్షితులు సవాల్ చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా తనను కొనసాగించేలా టీటీడీని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ ను ఇవాళ విచారించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయశాఖ ముఖ్యదర్శితో పాటు టీటీడీని ఆదేశించింది.