డిసెంబరు వరకు దస్త్రాల క్లియరెన్స్‌లో మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. తాను 6వ స్థానంలో ఉన్నట్టు సీఎం చెప్పారు. మొదటి స్థానంలో ఎన్‌ఎండీ ఫరూఖ్, రెండో స్థానంలో కందుల దుర్గేశ్, మూడో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఇకపోతే సీఎం చంద్రబాబు ఆరో స్థానంలో ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉన్నారు. వాసంశెట్టి సుభాశ్ చివరి (25వ) స్థానంలో నిలిచారు.