సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన. తాజాగా కోల్‌కతాలో వైద్యవిద్యార్థిపై జరిగిన అత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చూస్తుంటే సమాజంలో మానవత్వం ఎక్కడుందని, అనాగరిక సమాజంలో మనం బతుకున్నామా అని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఏమని స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటామని నిలదీసింది. మహిళల భద్రత, గౌరవం కాపాడేందుకు దేశంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.