అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న SA20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు రషీద్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పార్ల్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20ల్లో (అంతర్జాతీయ, లీగ్‌లు కలిసి) 632 వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్ తరపున 161 వికెట్లు, మిగిలిన 472 వికెట్లు దేశవాళీతోపాటు వివిధ లీగుల్లో పడగొట్టాడు.