దివంగత ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు చివరి వరకు నమ్మకమైన కేర్ టేకర్, మేనేజర్‌గా వ్యవహరించిన యువకుడు శంతను నాయుడుకు మంచి అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే టాటా గ్రూప్‌లో కీలక పదవి దక్కింది. ఈ విషయాన్ని నాయుడు లింక్డ్ఇన్ వేదికగా ప్రకటించారు. "టాటా మోటార్స్‌లో జనరల్ మేనేజర్, హెడ్ - స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్‌గా నేను ఒక కొత్త పదవిని ప్రారంభిస్తున్నాను" అని ఆయన చెప్పుకొచ్చారు.