భద్రాచలం రామాలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

60చూసినవారు
భద్రాచలం రామాలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
TG: భద్రాచలం రామాలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామిని బంగారు కవచంతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరువీధులలో దర్శనమిచ్చారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంపై స్వామివారిని తిరువీధులలో అర్చకులు ఊరేగించనున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి తరలివస్తున్నారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్