AP: శ్రీకాకుళంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల వేడుకలలో శోభాయమానంగా ఏర్పాటు చేసిన శోభాయాత్ర వేలాది మంది భక్తులు నడుమ దిగ్విజయంగా సాగింది. ఈ శోభాయాత్రలో ఏర్పాటు చేసిన కోలాటం, తప్పెటగుళ్ళు, థింసా, కోయ నృత్యం, కొమ్ము నృత్యం, బిందెల డాన్స్ వంటి ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. వందమంది మహిళలతో కలశ యాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.