తిరుమలలో రథసప్తమి వేడుకలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. శ్రీవారి వాహన సేవలను సుమారు 2.50 లక్షల మంది భక్తులు వీక్షించారని చెప్పారు. ఎండ వేడిమి తగలకుండా ఆలయ మాడవీధుల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి వాహన సేవలు పూర్తయ్యేవరకు నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశామన్నారు. గ్యాలరీల బయట ఉన్న భక్తులు ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా వాహన సేవలను వీక్షించారని తెలిపారు.