రేషన్ వ్యాన్లు రద్దు.. ఆ వాహనాలను ఏం చేస్తారు?

66చూసినవారు
రేషన్ వ్యాన్లు రద్దు.. ఆ వాహనాలను ఏం చేస్తారు?
AP: రేషన్ వాహనాలను రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రకటించారు. దాంతో రాష్ట్రంలో ఉన్న 9,260 రేషన్ వాహనాలను ఏం చేస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. వీటి కోసం గత వైసీపీ ప్రభుత్వం రూ.539 కోట్లు ఖర్చు చేసింది. తాము అధికారంలోకి వస్తే ఈ వాహనాలను చెత్త తరలించేందుకు వినియోగిస్తామని టీడీపీ చెప్పింది. దీని ప్రకారం వీటిని చెత్త తరలింపు వాహనాలుగా మారుస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

సంబంధిత పోస్ట్