AP: గ్రామ, వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణలో భాగంగా స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 10న జనరల్ పర్పస్ ఫంక్షనరీలను ప్రభుత్వం కేటాయించింది. అప్పట్లోనే టెక్నికల్ ఫంక్షనరీలను సంబంధించి విడిగా మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించింది. తాజా ఉత్తర్వులతో సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణ ప్రక్రియ దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.