ఇటీవల టీమిండియాలోని కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో టెస్ట్ జెర్సీ ధరించిన ఫోటోను షేర్ చేయడంతో అభిమానుల్లో పలు అనుమానాలు తలెత్తాయి. జడేజా కూడా టెస్టులకు వీడ్కోలు చెబుతున్నాడా అంటూ నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై జడేజా ఎలా స్పందిస్తాడో చూడాలి.