దేశీయ కరెన్సీ రూపాయి విలువ క్షీణించడంపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డాలరుతో రూపాయి విలువను మార్కెట్ శక్తులు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. రూపాయి విలువ రోజువారీ మార్పులపై ఆర్‌బీఐ పెద్దగా ఆందళన చెందబోదని తెలిపారు. దీర్ఘకాల, మధ్యస్థ కాలంలో రూపాయి విలువ మార్పుపైనే ఆర్‌బీఐ దృష్టి సారిస్తుందని సంజయ్ చెప్పారు.